Romancham: ఓటీటీలో మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘రోమన్‌చమ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

హారర్‌ కామెడీ చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారు. తెరపై నటీనటులు భయపడుతూ నటిస్తుంటే, సినిమా చూస్తున్న వాళ్లు తెగ ఆనందపడిపోతుంటారు.

Published : 29 Mar 2023 16:27 IST

హైదరాబాద్‌: హారర్‌ కామెడీ చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారు. తెరపై నటీనటులు భయపడుతూ నటిస్తుంటే, సినిమా చూస్తున్న వాళ్లు తెగ ఆనందపడిపోతుంటారు. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఓటీటీలు డబ్‌ చేసి ఇతర భాషల సినీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. అలా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో మలయాళ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జితు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రోమన్‌చమ్‌’ (romancham ott release date) (రోమాలు నిక్కబొడుచుకోవడం). ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు