Chiranjeevi: ఆరు వేల మంది విద్యార్థులతో ‘వాల్తేరు వీరయ్య’ రూపం.. విజువల్స్‌ అద్భుతం

మల్లారెడ్డి విశ్వవిద్యాలయం విద్యార్థులు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటారు. ‘వాల్తేరు వీరయ్య’ లుక్‌ను రీ క్రియేట్‌ చేశారు.

Published : 31 Oct 2022 01:46 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బాబీ దర్శకుడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌, చిరు ఫస్ట్‌ లుక్‌ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ లుక్‌నే రీ క్రియేట్‌ చేసి చిరంజీవిపై ఉన్న ఉన్న అభిమానాన్ని చాటారు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం విద్యార్థులు. తమ యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ లుక్‌ డ్రా చేసి.. ఆ ఆకారంలో సుమారు ఆరు వేలమంది కూర్చొన్నారు. సంబంధిత విజువల్స్‌ను చిత్రీకరించి.. శనివారం సాయంత్రం తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఆ వీడియోను ప్లే చేశారు. వీడియో చూసిన చిరు మురిసిపోయారు. తనపై ప్రేమ కురిపించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ఆ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌ వేదికగా ఆదివారం షేర్‌ చేశారు. ‘వావ్‌, అదుర్స్‌’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. సినిమా అప్‌డేట్స్‌ కావాలని దర్శకుడిని కోరుతున్నారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. 2023 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని