Malli pelli review: రివ్యూ: మళ్ళీ పెళ్లి.. నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ల మూవీ ఎలా ఉందంటే?

Malli pelli review: నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘మళ్ళీ పెళ్లి’ ఎలా ఉందంటే?

Updated : 26 May 2023 15:27 IST

Malli pelli review; చిత్రం: మళ్ళీ పెళ్లి; నటీనటులు: నరేశ్‌, పవిత్రలోకేశ్‌, వనిత విజయ్‌కుమార్‌, శరత్‌బాబు, భద్రం, తదితరులు; సంగీతం: అరుళ్‌దేవ్‌, సురేష్‌ బొబ్బిలి; ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ; రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజు; విడుదల: 26-05-2023

క‌ప్పుడు న‌రేశ్ క‌థానాయ‌కుడిగా చాలా సినిమాలే చేశారు. ప‌విత్ర లోకేశ్ కూడా క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం స‌హాయ న‌టులుగా రెండో ఇన్నింగ్స్‌ని  కొన‌సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో ఆ ఇద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఓ సినిమా చేయాల్సి వ‌చ్చింది. అందుకు కార‌ణం ‘మ‌ళ్ళీ పెళ్లి’ (Malli pelli review) సినిమాలోని క‌థే.  సీనియ‌ర్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈమ‌ధ్య‌కాలంలో బ‌ల‌మైన ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన సినిమాల్లో ఇదొక‌టి. ఇంత‌కీ ఈ సినిమాలోని క‌థేమిటి?  సినిమా ఎలా ఉంది?

క‌థేమిటంటే: ప్ర‌ముఖ న‌టుడైన న‌రేంద‌ర్ (న‌రేశ్‌), సౌమ్య సేతుప‌తి (వనిత విజ‌య్‌కుమార్‌) వివాహ బంధంతో ఒక్క‌టై ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చాక‌... కాపురంలో కొన్ని క‌ల‌హాలు మొద‌ల‌వుతాయి. ప్ర‌శాంత‌త కావాల‌నుకున్న న‌రేంద‌ర్ జీవితంలోకి మ‌రో ప్ర‌ముఖ న‌టి అయిన పార్వ‌తి (ప‌విత్ర లోకేశ్‌) ఎలా వ‌చ్చింది? (Malli pelli review) ఆమె జీవితం వెన‌క సంఘ‌ర్ష‌ణ ఎలాంటిది? ఆమె కోసం న‌రేంద‌ర్ ఏం చేశాడనేది తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: ప్రేక్ష‌క ప్ర‌పంచానికి తెలిసిన క‌థనే ఈ సినిమాలో చూపించారు. న‌రేశ్‌, ప‌విత్ర‌లు నిజ జీవితంలోని పాత్ర‌ల్నే ఇందులోనూ పోషించారు. వీళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ప్ర‌పంచం మొత్తానికి తెలుసు. టెలివిజ‌న్ ఛాన‌ళ్లు, సామాజిక మాధ్య‌మాలు కోడై కూశాయి. అవే సంఘ‌ట‌న‌ల్ని, అవి చోటు చేసుకోవ‌డం వెన‌క జరిగిన ప‌రిణామాల్ని న‌రేశ్‌, ప‌విత్ర కోణం నుంచి తెర‌పైకి తీసుకొచ్చే ప్రయ‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు. త‌న‌కీ, ప‌విత్ర లోకేశ్‌కీ మ‌ధ్య‌నున్న బంధానికి ఓ సినిమా రూపం ఉంటే బాగుంటుంద‌నుకున్నారో ఏమో, అందుకు త‌నే పూనుకుని సినిమాగా నిర్మించారు న‌రేశ్‌. (Malli pelli review) ఒక ర‌కంగా ఆ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ‌కి సంబంధించిన బ‌యోపిక్ ఇది. ఆ ఇద్ద‌రూ ఎలా ప‌రిచ‌యం అయ్యారో... వాళ్ల మ‌ధ్య బంధం ఎలా బ‌ల‌ప‌డిందో ప్ర‌థ‌మార్ధంలో చూపించారు. నరేశ్ పెళ్లి చేసుకున్న మూడో భార్యపై న‌రేశ్ ఇదివ‌ర‌కు మీడియా వేదిక‌గా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆ ఆరోప‌ణ‌లకీ, ఆమెతో సాగిన న‌రేశ్ జీవితానికి ఆయ‌న‌దైన కోణంలో తెర‌రూపం ఇచ్చారు.

ప్రేక్ష‌కుల‌కి అంత‌గా తెలియ‌ని విషయాన్ని ఇందులో ఏమైనా చూపించారా అంటే అది పార్వ‌తి (పవిత్రా లోకేశ్‌) వ్య‌క్తిగ‌త జీవితమే. ర‌చ‌యిత, న‌టుడైన పార్వ‌తి భ‌ర్తతో ఆమె జీవితం ఎలా సాగిందో, అత‌ని ద‌గ్గ‌ర ఏం క‌రవై న‌రేంద‌ర్‌కి చేరువైందో ద్వితీయార్ధంలో చూపించారు. క‌థానాయిక‌గా మొద‌లైన పార్వ‌తి ప్ర‌యాణం..  ఆమె ప్రేమ‌లో ప‌డ‌టం, స‌హ‌జీవ‌నం, ఆమె జీవితంలోని అసంతృప్తి త‌దనంత‌ర ప‌రిణామాల్ని ఆ ఛాప్ట‌ర్‌లో ఆవిష్కరించారు. (Malli pelli review) న‌రేంద‌ర్‌, పార్వ‌తి, సౌమ్య జీవితంలోని సంఘ‌ట‌న‌లు త‌ప్ప ద‌ర్శ‌కుడు చెప్పిన కొత్త విష‌య‌మేమీ లేదు. సౌమ్య పాత్ర‌ని విల‌న్‌గా చూపించారు.  ఇదంతా టీవీల్లో చూసిందే క‌దా అనుకుంటే అది ప్రేక్ష‌కుడి త‌ప్పేమీ కాదు. సౌమ్య త‌ల‌పై మ‌ద్యం పోసి చంపేస్తానంటూ బెదిరించ‌డం, ఒంటినిండా రోగాలే అంటూ దుర్భాష‌లాడ‌టం, పార్వ‌తిని నాతో పంపించు అంటూ ఆమె భాగ‌స్వామి ద‌గ్గ‌రికి  న‌రేంద‌ర్ వెళ్లి అడిగే స‌న్నివేశాలు అంత హుందాగా అనిపించ‌వు.

ఎవ‌రెలా చేశారంటే: న‌రేశ్‌, ప‌విత్ర లోకేశ్‌, వ‌నిత విజ‌య్‌కుమార్‌ల చుట్టూనే స‌న్నివేశాలు సాగుతాయి. ఆ ముగ్గురూ పాత్ర‌లకు త‌గ్గ‌ట్టుగా మంచి న‌ట‌న‌ని క‌న‌బ‌రిచారు. న‌రేశ్ త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల పాత్ర‌లో జ‌య‌సుధ, సూప‌ర్‌స్టార్ కృష్ణ పాత్ర‌లో శ‌ర‌త్‌బాబు న‌టించారు. జ‌య‌సుధ, న‌రేశ్ మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. (Malli pelli review) అన‌న్య నాగ‌ళ్ల యుక్త‌వ‌య‌సు పార్వ‌తిగా అందంతో ఆక‌ట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, కూర్పు, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ త‌దిత‌ర విభాగాలు నాణ్య‌మైన ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాతో చెప్పిన కొత్త విష‌యం అంటూ ఏమీ లేదు. అంద‌రికీ తెలిసిన విష‌యాల్నే ఐదు ఛాప్ట‌ర్లుగా తెర‌పైకి తీసుకొచ్చారు. ర‌చ‌న కంటే కూడా, ద‌ర్శ‌క‌త్వం ప‌రంగా ఆయనకు ఎక్కువ మార్కులు పడతాయి. అనుకున్న విష‌యాన్ని ఆసక్తికరంగా తెర‌పైకి తీసుకొచ్చారు. (Malli pelli review) నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బ‌లాలు
  • + న‌రేశ్‌, ప‌విత్ర న‌ట‌న
  • + విరామ స‌న్నివేశాలు
  • + పార్వ‌తి ఫ్లాష్‌బ్యాక్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - తెలిసిన క‌థ
  • - నరేశ్‌, పవిత్రల కోణం నుంచే చూపించడం
  • చివ‌రిగా: న‌రేశ్‌, ప‌విత్ర‌ల ప్రేమ‌క‌థ‌... మళ్ళీ పెళ్లి  (Malli pelli review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు