Naresh: జీవితాంతం నటుడిగానే ఉంటా

‘‘వినోదం.. సందేశం కలిపితే ‘మళ్లీ పెళ్లి’ సినిమా. దీన్ని నేను, పవిత్ర, మా చిత్ర బృందం మొత్తం ఎంతో ఇష్టపడి చేశాం. మాస్‌, క్లాస్‌, యూత్‌, ఫ్యామిలీ.. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆస్వాదిస్తున్నారు’’ అన్నారు నటుడు నరేష్‌ వి.కె. ఆయన.. పవిత్ర లోకేష్‌ కలిసి నటించిన చిత్రమే ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్‌.రాజు తెరకెక్కించారు.

Updated : 29 May 2023 13:55 IST

‘‘వినోదం.. సందేశం కలిపితే ‘మళ్లీ పెళ్లి’ సినిమా. దీన్ని నేను, పవిత్ర, మా చిత్ర బృందం మొత్తం ఎంతో ఇష్టపడి చేశాం. మాస్‌, క్లాస్‌, యూత్‌, ఫ్యామిలీ.. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆస్వాదిస్తున్నారు’’ అన్నారు నటుడు నరేష్‌ వి.కె (Naresh). ఆయన.. పవిత్ర లోకేష్‌ కలిసి నటించిన చిత్రమే ‘మళ్లీ పెళ్లి’ (Malli pelli). ఎం.ఎస్‌.రాజు తెరకెక్కించారు. విజయ కృష్ణ మూవీస్‌ పతాకంపై నరేష్‌ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆదివారం సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రసీమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న నరేష్‌ను సెలబ్రిటీ వరల్డ్‌ రికార్డ్‌తో సత్కరించారు ఆ సంస్థ నిర్వాహకులు. అనంతరం నరేష్‌ మాట్లాడుతూ.. ‘‘రియల్‌ బోల్డెస్ట్‌ కపుల్‌ అంటే కృష్ణ, విజయనిర్మల. తన భార్య ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృష్ణ.. విజయ కృష్ణ మూవీస్‌ ప్రారంభించారు. ఇది చాలా అరుదు. వాళ్ల రథం ముందుకెళ్లాలని దీన్ని నేను పునఃప్రారంభించాను. ‘మళ్లీ పెళ్లి’కి వచ్చిన రిజల్ట్‌తో కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు అందుకున్నాం. కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాని ఆయనకు అంకితం చేస్తున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్‌ రోజురోజుకి పెరుగుతున్నారు. కన్నడ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నాం. నా చివరిశ్వాస ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటా. మంచి కథలు ఉంటే తీస్తా. నా వంతు సామాజిక సేవ చేస్తా’’ అన్నారు.

‘‘జీవితానికి సంబంధించిన రహస్యాల్ని ఎవరూ బయటకు చెప్పరు. కానీ, కొన్నిసార్లు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది మా కథ కాదు.. సమాజంలోని కథ అనుకుంటే మేము గెలిచినట్లే అనుకున్నాం. అదే నిజమైంది. నరేష్‌ వల్లే ఈ చిత్రం సాధ్యమైంది. ఇందులో నా పాత్ర ద్వారా మహిళల హక్కులు నిలబడితే ఆనంద పడతాను’’ అన్నారు నటి పవిత్ర లోకేష్‌. కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ, సురేష్‌ బొబ్బిలి, రవివర్మ, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని