Malvi Malhotra: రాజ్‌ తరుణ్‌ పర్సనల్‌ లైఫ్‌ నాకు తెలియదు: మాల్వీ మల్హోత్రా

రాజ్‌ తరుణ్‌ వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని నటి మాల్వీ అన్నారు.

Published : 11 Jul 2024 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తిరగబడర సామీ’ సినిమాలో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun)తో కలిసి నటించానే తప్ప ఆయన వ్యక్తి జీవితం గురించి తెలుసుకోలేదని బాలీవుడ్‌ నటి మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) పేర్కొన్నారు. తమపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి కూడా రాజ్‌ తరుణ్‌ గతంలో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆ సినిమా (Thiragabadara Saami) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూలో మాల్వీ.. తాజా కాంట్రవర్సీపై స్పందించారు.

‘‘ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఊహించలేదు. మంచి విమర్శను స్వీకరిస్తానేగానీ ఇలాంటి నెగెటివ్‌ కామెంట్లను పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్‌. నా దృష్టంతా కెరీర్‌పైనే ఉంది. సినిమానే నా ఫస్ట్‌ లవ్‌. రాజ్‌ తరుణ్‌ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. అది ఆయన పర్సనల్‌. అందుకే సినిమా గురించే మాట్లాడాలనుకుంటున్నా’’ అని యాంకర్‌కు సమాధానమిచ్చారు.

రాజ్‌ తరుణ్‌- లావణ్య ఇష్యూ.. మరో ఇద్దరిపై కేసు నమోదు

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎ.ఎస్‌. రవికుమార్‌ తెరకెక్కించిన చిత్రమే ‘తిరగబడర సామీ’. ఈ చిత్రంతో యాక్షన్‌ హీరోగా రాజ్‌ తరుణ్‌కు పేరొస్తుందని దర్శకుడు నమ్మకంగా ఉన్నారు. ఆగస్టు 2న సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని