Mammootty: సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన స్టార్‌ హీరో..

మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి(Mammootty) తను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధపెట్టాయని సోషల్‌మీడియాలో క్షమపణలు చెప్పారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 

Published : 15 Dec 2022 15:04 IST

హైదరాబాద్‌: మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి(Mammootty) సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన తప్పును తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అసలు విషయమేమిటంటే.. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా  ‘2018’ అనే చిత్రం రూపొందుతోంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ జూడో ఆంథనీ జోసెఫ్‌( Jude Anthany Joseph) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ లాంఛ్‌ వేడుకలో మమ్ముట్టి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు.

లాంఛ్‌ ఈవెంట్‌లో మమ్ముట్టి మాట్లాడుతూ ‘జూడో తలపై వెంట్రుకలు లేకపోయినా, అద్భుతమైన మెదడు ఉన్న ప్రతిభావంతుడైన దర్శకుడు’ అని అన్నారు. అయితే ఈ కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్‌తో సమానమంటూ పోస్టులు చేశారు. దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ తన అధికారిక సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘డియర్‌ ఆల్‌... నిన్న జరిగిన ‘2018’ టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో దర్శకుని ప్రశంసించేందుకు నేను వాడిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని