Mammootty: మాస్ లుక్‌లో మమ్ముట్టి
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి మరోసారి యాక్షన్ అవతారం ఎత్తారు. ఇటీవల ‘క్రిస్టోఫర్’ సినిమాలో ఐపీఎస్ పాత్రలో కనిపించిన మమ్ముట్టి ఇప్పుడు ‘బజూక’ అనే చిత్రంలో మాస్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty) మరోసారి యాక్షన్ అవతారం ఎత్తారు. ఇటీవల ‘క్రిస్టోఫర్’ సినిమాలో ఐపీఎస్ పాత్రలో కనిపించిన మమ్ముట్టి ఇప్పుడు ‘బజూక’ (Bazooka) అనే చిత్రంలో మాస్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మమ్ముట్టి చాన్నాళ్ల తర్వాత మళ్లీ తన బైక్ ప్రయాణాన్ని మొదలుపెడుతున్నరన్నట్లుగా బైక్ కవర్ తీస్తూ కనిపించారు. ఈ సినిమాతో డీనో డెన్నిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణను గత నెల్లో కేరళలోని ఎర్నాకుళంలో మొదలుపెట్టారు. ఈ సినిమాలో గౌతమ్ మేనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డెన్నిస్ మాట్లాడుతూ...ఎప్పటినుంచో మమ్మూట్టి సార్‌తో పని చేయాలన్న కోరిక ఉండేది. ఈ సినిమాతో నా జీవిత కల నెరవేరింది. ఈ చిత్ర టీజర్‌ను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.