Mamta Mohandas: మరో హీరోయిన్ ఉంటే షూట్‌కు రానంది.. నయన్‌పై మమత పరోక్ష ఆరోపణలు
అగ్రకథానాయిక నయనతార (nayanthara)పై పరోక్షంగా ఆరోపణలు చేశారు నటి మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas). మరో హీరోయిన్ ఉంటే షూట్‌కు రానని నయన్ చెప్పినట్లు తెలిసిందని ఆమె చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర కథానాయిక నయనతార(Nayanthara)పై నటి మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ సినిమా విషయంలో నయన్ కోసం చిత్రబృందం చేసిన పని వల్ల తాను బాధపడినట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆ సినిమా కోసం తాను నాలుగు రోజులు వృథా చేసుకున్నట్లు చెప్పారు.
‘‘రజనీకాంత్ (Rajinikanth) నటించిన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో పాట కోసం నన్ను సంప్రదించారు. సుమారు నాలుగు రోజులపాటు షూట్ చేశాం. షూట్ చేస్తున్నప్పుడే అర్థమైంది.. ఆ ఫ్రేమ్‌లో నేను లేనని. తీరా ఫైనల్ కాపీ బయటకు వచ్చేసరికి నా షాట్స్ ఏమీ లేవు. కేవలం ఒకే ఒక్క షాట్‌లో వెనుక నుంచి కనిపిస్తా. నాకు చెప్పినవిధంగా ఆ పాటను చిత్రీకరించలేదు. అయితే, ఆ సినిమాలో ఎవరైతే హీరోయిన్‌గా నటించారో ఆమె వల్లే అలా జరిగినట్లు కొంతకాలం తర్వాత నాకు తెలిసిన వాళ్లు చెప్పారు. ఆ పాటలో మరో హీరోయిన్ ఉందనే సమాచారం తనకు లేదంటూ తాను షూట్‌కు రానని ఆమె చెప్పిందని.. అందుకే నా పార్ట్‌ను చిత్రీకరించలేదని చెప్పారు. ఆ సినిమా కోసం 4 రోజులు వృథా చేసుకున్నా. ఈ మొత్తం వ్యవహారం వల్ల ఎంతో బాధగా అనిపించింది’’ అని మమతా మోహన్‌దాస్ అన్నారు.
రజనీకాంత్ - నయనతార జంటగా నటించిన చిత్రాల్లో ‘కథానాయకుడు’ ఒకటి. 2008లో విడుదలైన ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్ అతిథి పాత్రలో కనిపించారు. ఇందులోని ‘‘దేవుడే స్వర్గం నుంచి’’ అనే పాటలో ఆమె ఓ చోట తళుక్కున మెరిశారు. తాజాగా మమత వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిన తరుణంలో ఆమె మాట్లాడేది ‘కథానాయకుడు’, నయనతార గురించేనని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!