Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌పై ‘భీమ్లా నాయక్‌’ డైరక్టర్‌ కామెంట్స్‌... ఏమన్నారంటే?

‘భీమ్లానాయక్‌’ విజయంలో త్రివిక్రమ్‌ విలువను కొలవలేమని దర్శకుడు సాగర్‌ కె.చంద్ర అన్నారు.

Updated : 27 Mar 2022 16:21 IST

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’ విజయంలో త్రివిక్రమ్‌ విలువను కొలవలేమని దర్శకుడు సాగర్‌ కె.చంద్ర అన్నారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సాగర్‌ అనేక విషయాలను పంచుకున్నారు. ‘భీమ్లానాయక్‌’కు త్రివిక్రమ్‌ వెన్నెముక అని ప్రశంసించారు. మాతృకతో పోలిస్తే పవన్‌ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌, క్లైమాక్స్‌లో మార్పులు చేయటంతో కథ మొత్తం మారిపోయిందని అన్నారు. ఇదొక విభిన్న చిత్రమైపోయిందన్నారు. పవన్‌కల్యాణ్‌ పెద్ద స్టార్‌ అయినా దర్శకుడి కుర్చీకి గౌరవం ఇస్తారని.. కథకు, పాత్రకు తన నుంచి ఇంకేమైనా అదనపు హంగులు కావాలా? అని కూడా అడుగుతారని చెప్పుకొచ్చారు. ఏం చెప్పినా ఓపిగ్గా వింటారని, మరో టేక్‌ చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. ఇలా ఈ సినిమా గురించి సాగర్‌ పంచుకున్న విశేషాలు మీకోసం...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని