క్రిస్టల్ ప్యాలెస్ ఫిల్మ్ వేడుకకు ఎంపికైన ‘మనసానమః’

ఇంటర్నెట్‌ డెస్క్:  లండన్‌ చెందిన ప్రతిష్ఠాత్మక క్రిస్టల్‌ ప్యాలెస్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ వేడుకల్లో తెలుగు లఘు చిత్రం చోటు దక్కించుకుంది. మన దేశం తరపున ఈ వేడకల్లో చోటుదక్కించుకున్న తెలుగు లఘ చిత్రం ‘మనసానమ’.

Published : 19 Feb 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: లండన్‌ చెందిన ప్రతిష్ఠాత్మక క్రిస్టల్‌ ప్యాలెస్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ వేడుకల్లో తెలుగు లఘు చిత్రం చోటు దక్కించుకుంది. మన దేశం తరపున ఈ వేడుకల్లో చోటుదక్కించుకున్న తెలుగు లఘచిత్రం ‘మనసానమః’. దీపక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  విరాజ్ అశ్విన్ - సూర్యగా,  ద్రిషికా చందర్ -  చైత్రగా, శ్రీవల్లి రాఘవేందర్ - వర్షగా, పృథ్వీ శర్మ - సీత పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథేంటంటే ఒక యువకుడు తన జీవితంలో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. కాలాల్లో మూడు రకాలు ఉన్నట్లు అతను చలికాలంలో ఒకరిని, వర్షకాలంలో ఒకరిని, వేసవిలో ఒకరిని ఇలా ఆ యువకుడి జీవితంలో చోటుకున్న సంఘటనలే చిత్ర కథ. క్రిస్టల్ ప్యాలెస్‌ వేడుకలకు ఎంపికైన సందర్భంగా దర్శకుడు దీపక్‌ రెడ్డి స్పందిస్తూ..‘‘ఈ  ఏడాది క్రిస్టల్ ప్యాలెస్ ఫిల్మ్ అంతర్జాతీయ వేడుకల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక తెలుగు లఘ చిత్రం 'మనసానమః' కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఉత్తేజకరంగాను, ఒకింత గౌరవం గాను ఉందని’’ తెలిపారు. ఈ చిత్రం  ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బోర్న్, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇడిల్విల్డ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ సినిమా,డబ్లిన్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లోనూ ప్రశంసలు అందుకుంది. కళా మోషన్‌ పిక్చర్స్  ప్రై.లి.పతాకంపై శిల్ప గజ్జల చిత్రాన్ని నిర్మించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని