- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Manchu Lakshmi: నటన.. నా కలలో కూడా ఊహించలేదు: మంచులక్ష్మి
హైదరాబాద్: నటిగా సినీ పరిశ్రమవైపు(Cini Industry) అడుగులు వేస్తానని కలలో కూడా తాను ఊహించలేదని నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) అన్నారు. నటి, వ్యాఖ్యాతగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోన్న ఆమె తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. తన తండ్రి మోహన్‌బాబుతో(MohanBabu) కలిసి ‘అగ్నినక్షత్రం’(Agninakshatram) సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది!! నటిగా ఈ రంగంలోకి వస్తానని ఎప్పుడూ కలలు కనలేదు. ఈ రోజు మా నాన్నతో కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం లభించింది. అలాగే మేమిద్దరం కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ‘అగ్నినక్షత్రం’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా. విమర్శలు, ట్రోల్స్ పట్టించుకోకుండా మీ హృదయం చెప్పింది విని ముందుకు అడుగులు వేయండి’’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో విడుదలైన ‘సన్నాఫ్ ఇండియా’ (Son Of India) తర్వాత మోహన్‌బాబు నటిస్తోన్న చిత్రమిది. ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. టైటిల్ మోషన్ పోస్టర్‌ని బట్టి చూస్తుంటే పోలీస్ కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మోహన్‌బాబు-లక్ష్మి ప్రత్యర్థులుగా పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ‘పిట్టకథలు’ (Pittakathalu) వెబ్‌సిరీస్ తర్వాత లక్ష్మి నటిస్తోన్న చిత్రమిదే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Deverakonda: ఆ విషయంలో నాకు ఏడుపొస్తుంది: విజయ్ దేవరకొండ
-
General News
Andhra News: స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. 175 మంది ఖైదీల విడుదల
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Khammam: కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి
-
Sports News
MS Dhoni : ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్ ‘టైమ్’
-
Viral-videos News
Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట హల్చల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ