Samantha: సమంత స్థానంలో మరొకరు ఉంటే కుంగిపోయేవారు..: మంచు లక్ష్మి
మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం ‘అగ్నినక్షత్రం’ (Agninakshatram) . ఈ సినిమాలోని పాటను సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ సమంత తీరు ఎంతోమందికి స్ఫూర్తి అన్నారు.
హైదరాబాద్: మంచు లక్ష్మి (Manchu Lakshmi) టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత(Samantha)తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సమంత ఎంతో ధైర్యవంతురాలని అన్నారు . లక్ష్మి నటించిన తాజా చిత్రం ‘అగ్నినక్షత్రం’ (Agninakshatram) సినిమాలోని పాటను సమంత తాజాగా విడుదల చేశారు. ఇలాంటి సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన మంచు లక్ష్మి.. సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సమంత గురించి ఆమె మాట్లాడుతూ..‘‘సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం. ఇప్పటి వరకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆమె స్థానంలో మరొకరు ఉంటే కుంగిపోయేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నా.. సామ్ తనను తాను మలుచుకున్న తీరు దేశమంతటికీ స్ఫూర్తినిస్తుంది. నిజంగా ఇలాంటి ధైర్యవంతురాలైన మహిళ నా సినిమాలోని పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని మంచు లక్ష్మి అన్నారు. అలాగే సమంత కూడా మంచి పాటను అందించారని ‘అగ్ని నక్షత్రం’ టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం సామ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ -సమంత నటిస్తోన్న తాజా చిత్రమిది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం