Manchu Lakshmi: 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా.. ఇండిగో సిబ్బంది పట్టించుకోలేదు: మంచు లక్ష్మి ఆగ్రహం

నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi)కి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. దీనిపై ఆమె ట్వీట్‌ చేశారు.

Published : 07 Mar 2023 17:26 IST

హైదరాబాద్‌: విమాన సంస్థ ఇండిగో(Indigo Airlines) సిబ్బంది తీరుపై సినీ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi)ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పనితీరును విమర్శిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మి ఆమె ప్రయాణించిన విమానంలో తన పర్సు మర్చిపోయారు. ఈ విషయమై ఆమె ఇండిగో సిబ్బందిని సాయం అడిగారు. వారు ఎంతకీ స్పందించకపోవడంతో ఆమె వరుస ట్వీట్లు చేశారు.

‘‘నేను తిరుపతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన సమయం కంటే ఇండిగో సిబ్బంది నాకు సాయం చెయ్యడానికి తీసుకున్న సమయమే ఎక్కువగా ఉంది. నాకు సహాయం చేస్తామని చెప్పిన సిబ్బంది కనుమరుగయ్యారు. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా కూడా వీళ్లు ఎలాంటి సాయం చెయ్యలేదు. దీనికి కూడా ఏమైనా ప్రాసెస్‌ ఉందా?’’ అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. మంచు లక్ష్మి ట్వీట్‌పై ఇండిగో సంస్థ స్పందించింది. ‘‘విమానంలో మీరు మర్చిపోయిన పర్సును మా సిబ్బంది మీకు అందజేస్తారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మీకు ఈ విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే మరోసారి మా మేనేజర్‌ను సంప్రదించండి’’ అని ఇండిగో సంస్థ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు