Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ సూచనలు.. అవేంటంటే..!

చిన్నారులకు నాణ్యమైన విద్యనందించే విషయంలో ముందుంటారు నటి, నిర్మాత లక్ష్మీ. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’ బాగుందని ప్రశంసిస్తూ..పలు సలహాలు, సూచనలు చేశారు.

Published : 23 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’ బాగుందని ప్రశంసిస్తూ నటి, నిర్మాత మంచు లక్ష్మి పలు సలహాలు, సూచనలు చేశారు. ‘‘మన దేశంలో పాఠశాల పరిసరాల్లో సరైన మరుగుదొడ్డి వసతులు లేవు. ఈ కారణంతో ఏటా లక్షలాది విద్యార్థినులు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం జీడీపీలో కేవలం 3 శాతమే ఖర్చు చేస్తోంది. ఈ కారణంగా ప్రైవేట్‌ పాఠశాలను ఎంపిక చేసుకునే విద్యార్థినుల సంఖ్య ఎక్కువవుతోంది. కానీ నాణ్యమైన విద్య (ఉచితంగా) పొందడం అనేది భారతదేశంలో ప్రాథమిక హక్కు.  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన   ‘మన ఊరు.. మన బడి’తో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్డడం చాలా ఆసక్తిగా అనిపించింది’’

‘‘వ్యక్తిగతంగా ఇంగ్లీష్‌ ప్రాముఖ్యత నాకు తెలుసు. ప్రపంచమంతా తిరిగి అందరితో అదే భాషలో మాట్లాడుతున్నానంటే ఆ భాష మీద పట్టు ఉండటం వల్లే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే.. ‘ ప్రభుత్వ బడుల్లో..  డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీ ట్రైనర్లలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. ‘టీచ్‌ ఫర్‌ ఛెయింజ్‌’ జాతీయ ఉద్యమంలో భాగంగా గతంలో ఐసీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐసీటీ ట్రైనర్లతో కలిసి పనిచేసిన ప్రభుత్వ బడులపై సానుకూల దృక్పథాన్ని మనం గమనించాం. ఇప్పుడు పాఠశాలల్లో ప్రవేశపెట్టే వివిధ కోర్సుల్లోనూ, బోధించే విధానాన్ని మరింత బలపరిస్తే చక్కటి ఫలితాలు రాబట్టవచ్చు. అయితే ఇది ప్రాథమిక దశ నుంచే ఆరంభమవ్వాలి. అప్పుడే పెద్ద ఎత్తున మార్పు తీసుకురాగలము. ఈ కార్యక్రమం ఓ రోల్‌ మోడల్‌ కావాలని.. నాణ్యమైన విద్యనందిస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని పాటిస్తాయని ఆశిస్తున్నా’’ అని  ట్వీట్‌ చేశారు.

కాగా గతేడాది ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ పేరుతో నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు మంచు లక్ష్మి. ఐటీ సంస్థలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో లీడింగ్‌ కంపెనీగా ఉన్న పెగా సిస్టమ్స్‌తో కలిసి ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ ద్వారా జాతీయ స్థాయిలో సేవలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు