కేటీఆర్‌కు కరోనా.. మంచు లక్ష్మి సలహా!

తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు స్వల్ప

Updated : 24 Apr 2021 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ వెల్లడించారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు చేశారు.

కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంపై సినీ నటి, మంచులక్ష్మి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కేటీఆర్‌ త్వరగా కోలుకో. నేను నటించిన అన్ని సినిమాలు ఇప్పుడు చూడండి’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరోవైపు కేటీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని