Pawan kalyan: పవన్‌కల్యాణ్‌ను కలిసిన మంచు మనోజ్‌

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని కలిశారు

Published : 15 Oct 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు మంచు మనోజ్‌ గురువారం అగ్రకథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ని కలిశారు. ‘భీమ్లానాయక్‌’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ సినిమా సెట్‌లో పవన్‌ను కలిసిన మనోజ్‌ దాదాపు గంటసేపు ముచ్చటించారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలపైనే చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ‘భీమ్లానాయక్‌’తో పాటు క్రిష్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమానూ పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ తదుపరి షెడ్యూల్‌ నవంబరు రెండో వారంలో మొదలవుతుందని సమాచారం.  

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని