Manchu Manoj: అలాంటి వారు సమాజానికి ప్రమాదకరం.. ప్రభుత్వానికి మంచు మనోజ్‌ విజ్ఞప్తి

పిల్లలపై నీచమైన కామెంట్స్‌ చేసే వారు సమాజానికి ప్రమాదరకరమని మంచు మనోజ్‌ అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

Updated : 08 Jul 2024 07:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమని మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందిస్తూ పోస్ట్‌ పెట్టారు. పిల్లలపై అసభ్య కామెంట్స్‌ చేసిన ఓ వ్యక్తికి వార్నింగ్‌ ఇచ్చారు. 

‘చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోంది. హాస్యం ముసుగులో సోషల్‌ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరమైంది. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం నేను ఏడాది క్రితం ఇన్‌స్టా ద్వారా ఒక వ్యక్తిని సంప్రదించాను. కానీ, అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈరోజు అదే వ్యక్తి సోషల్‌ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్‌ చేస్తున్నాడు. పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలి. దయచేసి ఇలాంటి వారిని ఉపేక్షించవద్దు’ అంటూ తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ అధికారులను కోరారు. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ ‘అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను’ అని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతోంది.

ఆ ఆపరేషన్‌ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్‌

 ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai Durgha Tej) కూడా పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయని ఆయన అన్నారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేశారు. పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు. సోషల్‌ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని