మహిళలపై ఆకృత్యాలు.. మనోజ్‌ ట్వీట్‌

టాలీవుడ్‌ కథానాయకుడు మంచు మనోజ్‌ సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మారాలని, నేరాలు ఆగాలని గాంధీ జయంతి సందర్భంగా ట్వీట్‌ చేశారు. ‘‘ఆడది అర్ధరాత్రి నిర్భయంగా బయట తిరగ గలిగినప్పుడు దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టు’.. అని బాపు చెప్పారు. పట్ట పగలే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు

Published : 03 Oct 2020 01:22 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు మంచు మనోజ్‌ సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మారాలని, నేరాలు ఆగాలని గాంధీ జయంతి సందర్భంగా ట్వీట్‌ చేశారు. ‘‘ఆడది అర్ధరాత్రి నిర్భయంగా బయట తిరగ గలిగినప్పుడు దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు’.. అని బాపు చెప్పారు. పట్ట పగలే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు సంవత్సరానికి ఓసారి సెలవిచ్చి ‘గాంధీ జయంతి’ శుభాకాంక్షలు చెప్పుకోవడంలో అర్థమేముంది?’. బాపు అంటే కరెన్సీ మీద ఒక డిజైన్‌ కాదు.. ఏడాదిలో ఓ రోజు సెలవు ఇచ్చే వారం కాదు.. ఆ రోజు మందు దొరకకుండా చేసే శాపం కాదు.. దయచేసి ఇకనైనా మారుదాం..’’ అని ఆయన ట్వీట్లు చేశారు.

యూపీలోని హాథ్రస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఉన్నత కులాలకు చెందిన నలుగురు వ్యక్తులు దళిత యువతిపై లైంగిక దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో యువతిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ వెల్లడించింది. మరోపక్క పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి రహస్యంగా ఆమె స్వగ్రామానికి తీసుకొచ్చి, అంత్యక్రియలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అత్యాచార ఘటనపై ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, పలు పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ ఈ విధంగా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని