Manchu Manoj: కుమార్తె పేరు ప్రకటించిన మంచు మనోజ్‌.. దీవెనలు కావాలంటూ పోస్ట్‌

తమ కుమార్తెకు పేరు పెట్టినట్లు మనోజ్‌ తెలిపారు. అభిమానుల దీవెనలు కావాలని కోరారు. 

Published : 08 Jul 2024 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మంచు మనోజ్‌ దంపతులు వారి కుమార్తెకు పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ఏప్రిల్‌లో వీరికి పండంటి ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. ఈ పాపను తామంతా ముద్దుగా ‘ఎంఎం పులి’ అని పిలుచుకుంటున్నట్లు గతంలో మంచు లక్ష్మి చెప్పారు. తాజాగా ఆ పాపకు బారసాల చేశారు. ఈ ఫొటోలను మనోజ్‌ (Manchu Manoj) తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

కుమార్తెకు ‘దేవసేన శోభా ఎంఎం’ (Devasena Shobha MM) అని పేరు పెట్టినట్లు మనోజ్‌ తెలిపారు. ‘శివుడి దయతో, మీ అందరి ప్రేమతో మా పాపకు ఈ పేరు పెట్టాం. మీ దీవెనలు కావాలి. శివ భక్తుడిగా.. సుబ్రహ్మణ్యస్వామి భార్య పేరు వచ్చేలా ‘దేవసేన’ అని పెట్టాం. మా అత్తగారు శోభా నాగిరెడ్డి పేరు వచ్చేలా ‘శోభా’ అని యాడ్ చేశాం’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా మంచు లక్ష్మికి మనోజ్‌ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మొదటినుంచి ఆమె ఎంతో సపోర్ట్‌గా నిలిచిందన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అయ్యాయి. అందులో మోహన్‌బాబు దంపతులతో పాటు మౌనిక రెడ్డి కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ పోస్ట్‌కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు చెబుతున్నారు.

‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా?

ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది మనోజ్‌ - మౌనికలు వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. నిహారిక కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని