Manchu Manoj: ట్విటర్ వేదికగా మంచు మనోజ్ ట్వీట్స్.. విష్ణును ఉద్దేశించేనా?
Manchu Manoj: తాజాగా మంచు మనోజ్ తన ట్విటర్ ఖాతాలో రెండు కొటేషన్లు పంచుకున్నారు. అవి తన సోదరుడు మంచు విష్ణుని ఉద్దేశించే అంటూ ఆయన అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు.
హైదరాబాద్: తన సోదరుడు మంచు విష్ణు (manchu vishnu)తో గొడవ పడుతున్న వీడియోను మంచు మనోజ్ (manchu manoj) షేర్ చేయడంతో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమ బంధువు, కుటుంబ సన్నిహితుడిపై విష్ణు దాడికి యత్నించడాన్ని మనోజ్ వీడియో రూపంలో బయట పెట్టడం సంచలనంగా మారింది. కొద్దిసేపటికే మనోజ్ ఆ వీడియోను తొలగించినా అప్పటికే అది సోషల్‌మీడియాలో దావానలంలా వ్యాపించింది. అయితే, ఈ ఘటనపై మంచు కుటుంబం ఎక్కడా స్పందించలేదు. తాజాగా శనివారం మనోజ్ షేర్ చేసిన పోస్టులు చూస్తుంటే, విష్ణును ఉద్దేశించే పరోక్షంగా పెట్టినట్లు తెలుస్తోంది.
ఇంతకీ మనోజ్ ఏం షేర్ చేశారంటే.. ‘కళ్ల ముందు జరిగే తప్పులు చూసి కూడా స్పందించకుండా బతికే కన్నా, పోరాడుతూ చావడానికైనా సిద్ధం’ అని సూజీ కాస్సెమ్ కొటేషన్‌ను షేర్ చేశారు. అలాగే ‘ప్రతికూల ఆలోచనలే సృజనాత్మకతకు నిజమైన శత్రువు’ అని డేవిడ్ లించ్ కొటేషన్ కూడా పంచుకున్నారు. దీంతో పాటు ‘మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి’ అంటూ నమస్కారం, లవ్ సింబల్ ఎమోజీని పంచుకున్నారు. మనోజ్ పోస్టులకు ఆయన అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే...
‘‘ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండీ ఇది ఇక్కడి పరిస్థితి’’ అంటూ మనోజ్ వీడియోలో చెబుతుండగా.. మంచు విష్ణు (Manchu vishnu) ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు. ‘‘వాడు ఏదో అన్నాడు కదా ఒరేయ్ గిరేయ్ అని’’ అంటూ విష్ణు ఎవరిపైనో కేకలు వేస్తుండగా అక్కడే ఉన్న ఇద్దరి వ్యక్తులు ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. అయితే.. విష్టు ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాగే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలు మాత్రం తెలియలేదు. మరోవైపు ఈ వీడియోను మంచు మనోజ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన కాసేపటికే డిలీట్ చేశారు. తాజాగా మనోజ్ షేర్ చేసిన పోస్టును చూసి ఆయన అభిమానులు కామెంట్స్ రూపంలో స్పందిస్తున్నారు. ‘అన్నా నీకు అండగా ఉంటాం’, ‘నువ్వు బాధపడకు అన్నా’, ‘న్యాయం పక్కన నిలబడ్డావు నువ్వు గ్రేట్ అన్నా’ అంటూ మనోజ్‌కు అభిమానులు అండగా నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Zepto: లింక్డిన్ ర్యాంకింగ్స్.. టాప్ ఇండియన్ స్టార్టప్‌గా జెప్టో
-
Canada: పన్నూపై నిషేధం విధించండి.. కెనడా హిందూ గ్రూపుల విజ్ఞప్తి
-
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ చూడలేదు.. ఎందుకంటే: సీనియర్ నటుడు వ్యాఖ్యలు
-
Chandrababu: చంద్రబాబు ఎస్ఎల్పీపై సుప్రీంలో విచారణ
-
Mahesh babu: రాజమౌళితో కంటే ముందు ఆ దర్శకుడితో మహేశ్ సినిమా!
-
Mahindra Cars: అందులో మా తప్పేం లేదు.. ఎయిర్‌బ్యాగ్‌ల కేసుపై మహీంద్రా వివరణ