Manchu Manoj: శుక్రవారం స్పెషల్‌ న్యూస్ చెబుతా: మంచు మనోజ్‌

జీవితంలోని మరో అంకంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించాడు నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj). దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పాడు.

Published : 18 Jan 2023 12:30 IST

హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వార్తను అందరితో పంచుకుంటానని నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) తెలిపాడు. ఈ మేరకు అతడు బుధవారం ఉదయం ఓ ట్వీట్‌ పెట్టాడు. తన కెరీర్‌లోనే సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దొంగ దొంగది’లోని ‘మన్మథ రాజా’ పాటకు సంబంధించిన జిఫ్‌ వీడియో షేర్‌ చేసిన అతడు.. ‘‘నా హృదయానికి చేరువైన ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకొని ఉన్నాను. జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతోన్నందుకు ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటి మాదిరిగానే మీ ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘అన్నా.. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా?’’, ‘‘కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నావా?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని