Manchu Vishnu: ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్‌కు భూమిపూజ: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ‘మా’ సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు....

Updated : 15 May 2022 17:11 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ‘మా’ సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విష్ణు ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఏఐజీ సేవలను కొనియాడారు. అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ‘మా’ శాశ్వత భవనానికి భూమి పూజా చేయనున్నట్లు చెప్పారు.

‘‘మా’ ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగానే అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాం. మరో ఆరు నెలల్లో భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాం. ‘మా’ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే నా ప్రధాన కర్తవ్యం. అందుకోసం నా కమిటీతో కలిసి తగిన ప్రణాళికలు రచించాం. ఇక, సినిమా టికెట్‌ ధరల విషయంలో నేను మాట్లాడలేదని అందరూ విమర్శించారు. కావాలనే నేను సైలెంట్‌గా ఉన్నా. టికెట్‌ ధరలు పెంచితే కొందరికి.. తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులున్నాయని చెప్పారు. టికెట్‌ రేట్లు అనేది చాలా పెద్ద విషయం. దీని గురించి, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అని మంచు విష్ణు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని