MAA elections: ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు నామినేషన్
సినీ నటుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో ‘మా’ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. మంగళవారం సినీ నటుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. విష్ణు అధ్యక్ష అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేయగా, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా బాబు మోహన్, ఉపాధ్యక్షులుగా మాదాల రవి, పృథ్వీరాజ్ బాలిరెడ్డి, కోశాధికారిగా శివబాలాజీ నామినేషన్ సమర్పించారు.
మంచు విష్ణు జట్టులో సహాయ కార్యదర్శులుగా కరాటే కల్యాణి, గౌతమ్‌రాజు ఎన్నికల బరిలో నిలస్తుండగా, కార్యవర్గ సభ్యులుగా అర్చన, అశోక్‌కుమార్, గీతాసింగ్, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరీరెడ్డి, సంపూర్ణేశ్‌బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు.పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల.ఎమ్.ఆర్.సి, రేఖ తదితరులు పోటీ చేస్తున్నారు. కాగా, సోమవారం ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా నామినేషన్ సమర్పించారు. మరో అధ్యక్ష అభ్యర్థి సీవీఎల్ నర్సింహారావు కూడా సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేశారు. తాజా ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్టోబరు 10న మా ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్