Manchu Vishnu: ‘ఆదిపురుష్‌’ టీజర్‌.. ఆ మాటలు నేను అనలేదు: మంచు విష్ణు

‘ఆదిపురుష్‌’ టీజర్‌ విషయంపై తాను స్పందించినట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు మంచు విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

Updated : 15 Oct 2022 12:26 IST

హైదరాబాద్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush) టీజర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా స్పష్టం చేశారు. ఈ సినిమా టీజర్‌పై తాను మాట్లాడినట్లు చక్కర్లు కొడుతోన్న సోషల్‌మీడియా కథనాలపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఫేక్‌ న్యూస్‌!! నేను ఊహించిన విధంగానే ‘జిన్నా’ (GINNA) రిలీజ్‌కు ముందు కొంతమంది కావాలనే ఇలాంటి నెగెటివ్‌ వార్తలను ప్రచారం చేస్తున్నారు. నా డార్లింగ్‌ ప్రభాస్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. అంతకు మించి నాకేమీ వద్దు’’ అంటూ విష్ణు స్పష్టతనిచ్చారు.

భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటించారు. ఇటీవల విడుదలైన ఈసినిమా టీజర్‌ సినీ ప్రియుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘జిన్నా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు.. ‘ఆదిపురుష్‌’ టీజర్‌పై స్పందించినట్లు పలు కథనాలు, సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ సినిమాని తాను భారీ స్థాయిలో ఊహించుకున్నానని, టీజర్‌ చూస్తే యానిమేటెడ్‌ మూవీలా ఉందని.. ఒక ప్రేక్షకుడిగా తాను మోసపోయానంటూ ఆయా పోస్టులు, కథనాల్లోని సారాంశం. దీనిపైనే తాజాగా విష్ణు స్పందించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు