Manchu Vishnu: ఆమెను చూసిన ప్రతిసారి మళ్లీ ప్రేమలో పడుతూనే ఉంటాను..

వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన సతీమణికి శుభాకాంక్షలు చెప్పారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu).  ఆమెతో దిగిన పలు ఫొటోలను ఆయన సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు.

Updated : 01 Mar 2023 15:51 IST

హైదరాబాద్‌: తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) కంటే సతీమణి విరానికకు తాను ఎక్కువగా భయపడతానని అన్నారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  శుభాకాంక్షలు చెబుతూ బుధవారం ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అలాగే, ఇన్‌స్టాలోనూ ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. ‘‘ఆమెను చూసిన ప్రతిసారీ నేను మళ్లీ ప్రేమలో పడుతూనే ఉంటాను. సరదాలు, సంతోషాలు, విహారయాత్రలు, ఇలా చెబుతూ వెళ్తే నా జీవితంలోని ప్రతిక్షణం తాను తోడుగా ఉన్నందుకు ఆనందిస్తున్నా. లవ్‌ యూ’’ అని ఆయన పేర్కొన్నారు.

విష్ణు ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆమెను కలిశారు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో 2008లో వివాహం చేసుకున్నారు. ఇక, కెరీర్‌ విషయానికి వస్తే.. విష్ణు నటించిన ‘జిన్నా’ గతేడాది విడుదలైంది. హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఈ చిత్రం తర్వాత ఆయన కొత్త సినిమాలను ప్రకటించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని