Cinema news: మణిరత్నం, శంకర్ మహదేవన్‌లకు భారత్‌ అస్మిత పురస్కారం

 ‘మౌన రాగం’, ‘బొంబాయి’, ‘రోజా’, ‘దిల్‌సే’, ‘సఖి’ వంటి క్లాసిక్‌ చిత్రాలు అందించిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం. బాలీవుడ్‌, కొలీవుడ్‌ సినీ పరిశ్రమకి ఆయన అందించిన సేవలకు గానూ భారత్‌ అస్మిత జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

Published : 03 Feb 2022 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘మౌనరాగం’, ‘బొంబాయి’, ‘రోజా’, ‘దిల్‌సే’, ‘సఖి’ వంటి క్లాసిక్‌ చిత్రాలు అందించిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం. బాలీవుడ్‌, కొలీవుడ్‌ సినీ పరిశ్రమకి ఆయన అందించిన సేవలకు గానూ భారత్‌ అస్మిత పురస్కారానికి ఎంపికయ్యారు. గురువారం వర్చువల్‌ వేదికగా జరగబోయే 18వ భారత్‌ అస్మిత అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారంతో పాటు రూ.50వేల నగదును అందుకోనున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

పుణెకు చెందిన ఎంఐటీ వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్‌ అస్మిత రాష్ట్రీయ అవార్డులతో సత్కరిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారత్‌ అస్మిత్‌ ఫౌండేషన్‌ తో పాటు ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ నిర్వాహకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి సినీరంగం తరఫున దర్శకుడు మణిరత్నం, గాయకుడు శంకర్‌ మహదేవన్‌కు ఈ అవార్డులను ప్రకటించారు. కాగా ఇప్పటి వరకూ మణిరత్నం.. ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్‌  అవార్డులుతో పాటు చలన చిత్రసీమకు అందించిన సేవలకు గానూ ‘పద్మశ్రీ’తో భారత ప్రభుత్వం సత్కరించింది. 

కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందారు శంకర్‌ మహదేవన్‌. శంకర్‌.. ఎసాన్‌, లాయ్‌తో కలిసి పలు భాషల్లో సంగీతమందించారు. ఇప్పటి వరకూ ఆయన మూడు జాతీయ పురస్కారాలతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని