Maniratnam: మీటూనా..? టాలెంటా? బిగ్గెస్ట్ మూవీలో వైరముత్తు ఎందుకు భాగం కాలేదు..!

కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు వైరముత్తు (Vairamuthu). ప్రముఖ దర్శకుడు...

Published : 21 Sep 2022 14:53 IST

చెన్నై: కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు వైరముత్తు (Vairamuthu). ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు ఆయన అందించిన సాహిత్యం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. అయితే, ఆయన రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో మాత్రం వైరముత్తు భాగం కాలేదు. ‘మీటూ’ ఆరోపణల కారణంగానే వైరముత్తును దూరం పెట్టారా..? అనే చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా మణిరత్నం స్పందించారు.

‘‘వైరముత్తు టాలెంట్‌ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కరుణానిధి సైతం గతంలో వైరముత్తు టాలెంట్‌ని గుర్తించి మెచ్చుకున్నారు. నేనిప్పటికీ ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన కవిత్వాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. ఆయనొక అద్భుతం. అయితే, వైరముత్తును మించిన కొత్త టాలెంట్‌ కూడా పరిశ్రమలో ఉంది. కొత్తవాళ్లకీ ప్రోత్సాహం అందించాలి’’ అని మణిరత్నం చెప్పుకొచ్చారు.

వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ గతంలో ఎంతోమంది మహిళలు ‘మీటూ’ వేదికగా తమ గళం విప్పారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు గతంలో కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని