Avikagor: అవికా కంటే నేను 18 ఏళ్లు పెద్ద

నటి అవికాగోర్‌తో తనకి సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌ ఉందంటూ వచ్చిన వార్తలపై సీరియల్‌ నటుడు మనీశ్‌రాయ్‌ సింగన్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని ఆయన అన్నారు. ఒక మగ, ఒక ఆడ స్నేహంగా ఉంటే ఎవ్వరూ....

Updated : 24 Jun 2021 14:22 IST

రిలేషన్‌షిప్‌ వార్తలపై పెదవి విప్పిన నటుడు

ముంబయి: నటి అవికాగోర్‌తో తనకి సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌ ఉందంటూ వచ్చిన వార్తలపై సీరియల్‌ నటుడు మనీశ్‌రాయ్‌ సింగన్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని ఆయన తేల్చిచెప్పారు. ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహంగా ఉంటే ఎవ్వరూ ఓర్చుకోలేరంటూ వ్యాఖ్యానించారు. ‘బాలికావధు’తో (చిన్నారిపెళ్లికూతురు) బాలనటిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అవికాగోర్‌. ఆ ధారావాహికతో అశేషమైన అభిమానులను సంపాదించుకొన్న అవికా ప్రస్తుతం సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

‘బాలికావధు’ తర్వాత అవికాగోర్‌, మనీశ్‌ ప్రధానపాత్రల్లో ‘సస్రూల్‌ సిమర్‌ కా’ అనే ధారావాహిక ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది. ఈ ధారావాహికలో అవికా - మనీశ్‌ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే మనీశ్‌తో కలిసి ఆమె రహస్యంగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. సదరు వార్తలపై తాజాగా మనీశ్‌ స్పందిస్తూ.. ‘అవికా నాకు మంచి స్నేహితురాలు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము స్నేహితులుగానే ఉన్నాం. మా స్నేహం గురించి వచ్చిన పుకార్లలో ఇది కూడా ఒకటి. ఇద్దరు వ్యక్తులు స్నేహంగా ఉంటే ఎందుకని తట్టుకోలేరు? వాళ్ల స్నేహాన్ని రిలేషన్‌షిప్‌గా మీరు ఎలా అనుకుంటున్నారు? అవికా కంటే వయసులో నేను 18 సంవత్సరాలు పెద్ద. ప్రస్తుతం తను మిలింద్‌ చంద్వాణీతో డేటింగ్‌లో ఉంది. వాళ్ల లైఫ్‌ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే , నేను కూడా గతేడాది వివాహం చేసుకున్నాను. ఇలాంటి రూమర్స్ చూసి నా సతీమణి నవ్వుకుంటుంది’ అని మనీశ్‌ వివరించారు.

‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయికగా మారిన అవికాగోర్‌.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో అవికా కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు కల్యాణ్‌దేవ్‌ హీరోగా వస్తున్న మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ రెండు కాకుండా.. మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని