
మెగా ఫ్యామిలీలో అందరితో పనిచేశా: మణిశర్మ
ఇంటర్నెట్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని రామ్‌చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీలో దాదాపు అందరితో పనిచేశానని సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. ఇప్పుడు సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి తొలిసారిగా పనిచేసే అవకాశం వచ్చిందని, ఆ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ దేవకట్టకు కృతజ్ఞతలు చెప్పారు. తేజ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా మణిశర్మ చెప్పుకొచ్చారు. దేవకట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ఇప్పటికే ఖరారు చేశారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. కాగా.. చిత్రం నుంచి గానా ఆఫ్ రిపబ్లిక్ పేరుతో మొదటి గీతం జూలై 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మణిశర్మ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘రిపబ్లిక్’ టీజర్ ఇప్పటికే విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇందులో సాయిధరమ్ తేజ్ పవర్ఫుల్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాజేశ్ కథానాయికగా సందడి చేయనుంది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.