Manjima Mohan: గౌతమ్ కార్తిక్‌‌.. నాకెంతో స్పెషల్‌: మంజిమా మోహన్‌

సీనియర్‌ నటుడు కార్తిక్‌ కుమారుడు, యువనటుడు గౌతమ్‌ కార్తిక్‌ అంటే తనకెంతో ఇష్టమని నటి మంజిమా మోహన్‌ తెలిపారు. తన జీవితంలో గౌతమ్‌ ముఖ్యమైన వ్యక్త..

Published : 20 Mar 2022 01:34 IST

యువనటుడితో రిలేషన్‌పై స్పందించిన నటి

చెన్నై: సీనియర్‌ నటుడు కార్తిక్‌ కుమారుడు, యువనటుడు గౌతమ్‌ కార్తిక్‌ అంటే తనకెంతో ఇష్టమని నటి మంజిమా మోహన్‌ తెలిపారు. తన జీవితంలో గౌతమ్‌ ముఖ్యమైన వ్యక్తి అని ఆమె అన్నారు. 2019లో విడుదలైన కోలీవుడ్‌ చిత్రం ‘దేవరట్టం’ కోసం గౌతమ్‌-మంజిమా మొదటి స్క్రీన్‌షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ ఏర్పడిందని.. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలోని ఓ ఇంట్లో సహజీవనం ఉంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని.. ఇటీవల వరుస కథనాలు చక్కర్లు దర్శనమిచ్చాయి. తాజాగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై మంజిమా మోహన్‌ స్పందించారు.

‘‘నటీనటులందరికీ వ్యక్తిగత జీవితమనేది ఒకటి ఉంటుంది. వృత్తిపరమైన జీవితాన్ని అందరితో పంచుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటాం. అదే మాదిరిగా నా ప్రైవేటు లైఫ్‌ని అందరితో పంచుకోవాలని లేదు. గౌతమ్‌కార్తిక్‌కు- నాకూ పెళ్లి అని ఇటీవల వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. మా తల్లిదండ్రులు మొదట్లో ఆ వార్తలు చదివి ఎంతగానో బాధపడ్డారు. ఇప్పుడు వాళ్లు కూడా నవ్వుకుంటున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. దానికి ఇంకాస్త సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటపెడతా. గౌతమ్‌ ఎంతో మంచి వ్యక్తి. నిజాయితీగా ఉంటాడు. అతను నా జీవితంలో ప్రత్యేకమైన, ముఖ్యమైన వ్యక్తి. నా కుటుంబం మొత్తానికి అతను తెలుసు. అతనితో ఉంటే సురక్షితంగా, సంతోషంగా ఉన్నాననే భావన కలుగుతుంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని