The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’కు సన్నాహాలు

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ కూడా అంతకుమించే అలరించింది.

Updated : 26 Nov 2022 08:26 IST

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man 3) దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ కూడా అంతకుమించే అలరించింది. దీంతో ఈ సిరీస్‌లో మూడో సీజన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రధారి మనోజ్‌బాజ్‌పాయ్‌ (manoj bajpayee) స్పందించారు. ఈ సిరీస్‌ ఎప్పుడు మొదలుకాబోయేది చెప్పారు. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ని త్వరగా మొదలుపెట్టడానికి అమెజాన్‌ సిద్ధంగానే ఉంది. కానీ దర్శకుడు రాజ్‌, డీకేలతో పాటు నేను కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది చివరి వరకూ పరిస్థితి అలాగే ఉంటుంది. వచ్చే ఏడాది మొదట్లో సీజన్‌ 3ను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి’’అని చెప్పారు. తొలి రెండు సిరీస్‌ల్లో నటించిన నటులతో పాటు ఈసారి పలువురు కొత్తవాళ్లు ఇందులో చేరనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని