Manoj Bajpayee: మద్యం ఫ్రీ అని తెలియగానే పెగ్గు మీద పెగ్గులాగేశా: మనోజ్ బాజ్‌పాయ్
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆయన ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఇక ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్‌లో శ్రీకాంత్ తివారీగా ఆయన నటన హైలైట్. ఆ సిరీస్ సక్సెస్ కావడంలో మనోజ్‌ది కూడా కీలక పాత్ర. అలాంటి నటుడు మద్యం ఫ్రీగా వస్తోందని తెలిసి, ఫుల్‌గా తాగేశాడట. మనోజ్ కెరీర్ తొలినాళ్లలో ఓ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలిసారి పారిస్ వెళ్లారు. అప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని మనోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘అప్పుడు నేను థియేటర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నా. ఓ కార్యక్రమం కోసం పారిస్ వెళ్లాల్సి వచ్చింది. అదే నా తొలి అంతర్జాతీయ పర్యటన. విమానంలో మందు సర్వ్ చేశారు. అయితే, వెళ్లేటప్పుడు మద్యం ముట్టుకోలేదు. తాగితే డబ్బు కట్టమంటారేమోనని అనుకున్నా. ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు. పైగా నేను థియేటర్ ఆర్టిస్ట్‌గా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కింద పారిస్ వెళ్తున్నా. అక్కడకు వెళ్లాక తెలిసిందేంటంటే, వాళ్లు ఫ్రీగానే మద్యం ఇస్తారని అర్థమైంది. వచ్చేటప్పుడు నాకు కావాల్సినంత మందు తాగేశా. ఎంతంటే చాలా సేపటి వరకూ నాకు స్పృహ కూడా లేదు’’ అని మనోజ్ అప్పటి సంగతులను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.
పారిస్ పర్యటన వల్ల తాను చాలా విషయాలను నేర్చుకున్నానని మనోజ్ అన్నారు. చాప్ స్టిక్స్‌తో తినడం అప్పుడే తెలిసిందన్నారు. తొలిసారి వాటిని పట్టుకోవడం కుదరలేదని తెలిపారు. వాటితో తినడానికి ప్రయత్నిస్తుంటే భోజనం కింద పడిపోయేదని చెప్పుకొచ్చారు. అప్పుడు ఒక మహిళ తన దగ్గరకు వచ్చి ఒక ఫోర్క్ ఇచ్చి ‘మీరు దీనితో ప్రయత్నించండి. చాప్‌స్టిక్స్‌తో తినడానికి కాస్త సాధన అవసరం’ అని సూచించిందట. అప్పటి నుంచి గత కొన్నిరోజుల వరకూ వాటిని ఉపయోగించాలంటే తాను చాలా భయపడిపోయేవాడినని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. కొన్ని రోజుల కిందట చాప్ స్టిక్స్‌తో ఎలా తినాలో తన కూతురు ద్వారా తెలుసుకుని, ఇప్పుడు ఎలాగో మేనేజ్ చేస్తూ తింటున్నానని వివరించారు. మనోజ్ ప్రస్తుతం ‘డిస్పాచ్’, ‘జొరామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Indigo: విమానంలోనూ వృత్తి ధర్మం చాటారు.. చిన్నారి ప్రాణాలు కాపాడారు
-
Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి
-
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్