‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee). ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) సిరీస్ గురించి మాట్లాడారు.
ముంబయి: దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man)తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీగా ఆయన నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే, ఈ సిరీస్‌లో నటించడానికి మనోజ్ మొదట్లో ఆసక్తి చూపించలేదట. మరోవైపు, ఆయన భార్య కూడా ఈ సిరీస్ గురించి విని కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావు? అని ప్రశ్నించిందట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
‘‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకే నన్ను కలవాలనుకుంటున్నారని ఓరోజు నాకు ఫోన్ వచ్చింది. ఆ సిరీస్‌లో శృంగారం, హింస.. అన్నీ మితిమీరి ఉంటాయని భావించిన నేను నటించాలనుకోవడం లేదని, అలాంటి ప్రాజెక్ట్‌లు చేయనని చెప్పేశాను. ‘మీరు అనుకున్నట్టుగా ఆ సిరీస్ ఉండదు. ఒక్కసారి వచ్చి వాళ్లను కలవండి’ అని సదరు వ్యక్తి బదులిచ్చాడు. ఆ వ్యక్తి మాటపై నమ్మకం ఉంచి వాళ్లను కలిశాను. స్క్రిప్ట్ విన్నాక నాలో ఆసక్తి పెరిగింది. చేస్తానని మాటిచ్చాచను. అయితే, ఎనిమిది నెలలపాటు ఇతర ప్రాజెక్ట్‌లు ఏమీ ఓకే చేయకుండా కేవలం దీనిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఇదే విషయం నా భార్యకు తెలిసింది. వెబ్‌సిరీస్ అంటే టీవీ సీరియల్ అని ఆమె అనుకుంది. ‘‘ఇలాంటి వాటిల్లో నటించి ఎందుకు నీ కెరీర్ నాశనం చేసుకుంటావు?’’ అని ప్రశ్నించింది. సిరీస్ విడుదలయ్యాక వచ్చిన స్పందనకు ఆమె ఆనందించింది’’ అని మనోజ్ వెల్లడించారు.
మనోజ్ బాజ్‌పేయి నటించిన సరికొత్త చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ (Sirf Ek Bandaa Kaafi Hai). కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. గత నెల 23న జీ5 ఓటీటీ వేదికగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనోజ్ నటనకు అంతటా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమా తాజాగా థియేటర్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ గురించి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!