WHAT THE FISH: మనోజ్‌.. కొత్త కబురు

కథానాయకుడు మంచు మనోజ్‌ ఓ కొత్త కబురు వినిపించారు. భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Updated : 21 May 2023 06:52 IST

కథానాయకుడు మంచు మనోజ్‌ ఓ కొత్త కబురు వినిపించారు. భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీన్ని ఎం.శ్రీనివాసులు, డి.వేణుగోపాల్‌, ఎం.మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా నిర్మించనున్నారు. శనివారం మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. సరికొత్త కథతో.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌తో ‘వాట్‌ ది ఫిష్‌’

మంచు మనోజ్‌ - వరుణ్‌ కోరుకొండ కలయికలో తెరకెక్కనున్న ‘వాట్‌ ది ఫిష్‌’ (WHAT THE FISH)చిత్రాన్ని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మనం మనం బరంపురం.. అన్నది ఉపశీర్షిక. దీన్ని విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ను శనివారం విడుదల చేశారు. అందులో ఆయన విభిన్న గెటప్పుల్లో కనిపించారు. ‘‘ఐయామ్‌ ఏ బ్యాడ్‌ చైల్డ్‌.. ఐయామ్‌ కమింగ్‌ ఫర్‌ యూ’’ అంటూ ఆ వీడియోలో మనోజ్‌ పాడిన పాట ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ‘‘వినూత్నమైన కథతో తెరకెక్కనున్న చిత్రమిది. టోరంటో, కెనడాలోని వివిధ ప్రదేశాల్లో 75రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని