Queen elizabeth: క్వీన్ ఎలిజబెత్-2 ప్రారంభించిన ఏకైక భారతీయ చిత్రం ఇదే!
క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) తుది శ్వాస విడవడంతో, ప్రజలు దేశంతో ఆమెకున్నా అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు. చివరిసారిగా భారత పర్యటనకు 1997 అక్టోబరు13న విచ్చేసిన క్వీన్ ఎలిజబెత్-2 అప్పట్లో ఒక తమిళ చిత్రాన్ని...
ఇంటర్నెట్ డెస్క్: క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) తుది శ్వాస విడవడంతో, దేశంతో ఆమెకున్న అనుబంధాన్ని ప్రజలు నెమరువేసుకుంటున్నారు. చివరిసారిగా భారత పర్యటనకు 1997 అక్టోబరు13న విచ్చేసిన ఆమె అప్పట్లో ఒక తమిళ చిత్రాన్ని ప్రారంభించారు. అదే ప్రముఖ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) కలల ప్రాజెక్టు మరుదనాయగమ్. అక్టోబరు16న ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించిన క్వీన్ ఎలిజబెత్ ఎంజీఆర్ ఫిల్మ్‌సిటీలో 20 నిమిషాలు గడిపారు. చిత్ర కథానాయకుడు కమల్ హాసన్ మరుదనాయగమ్ విశేషాలను ఆమెకు వివరించారు. రూ.కోటితో రూపొందించిన యుద్ధ సన్నివేశాన్ని రాణీ స్వయంగా వీక్షించారు. చిత్ర కథానాయకుడు కమల్‌హాసన్‌తో పాటు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, నటులు అమ్రిష్‌పురి, నాజర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న 18శతాబ్దపు యోధుడు మరుదనాయగం జీవితం ఆధారంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. తమిళ, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, ఆదిలోనే పలు ఆటంకాలతో ఆగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయినా ఇప్పటికీ ఈ చిత్ర నిర్మాణంపై స్తబ్దత నెలకొని ఉంది. ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ దర్శకత్వం వహించి, నిర్మాణ బాధ్యతలనూ చేపట్టారు.
ఈ సందర్భంగా నటుడు కమల్‌హాసన్ ట్విటర్ వేదికగా క్వీన్ ఎలిజబెత్-2కి నివాళులర్పించారు. ఇంగ్లాండ్ ఒక్కటే కాకుండా, ప్రపంచం మొత్తం ఆమెని ప్రేమించిందని కొనియాడారు. ఆమె మృతి ప్రపంచానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. చివరిసారి 5 సంవత్సరాల క్రితం ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆమెను కలిసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్‌మీడియా వేదికగా క్వీన్ ఎలిజబెత్-2 మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్