Updated : 23 Jan 2022 13:22 IST

Maruthi: సమయం వచ్చినప్పుడు అన్నీ రివీల్‌ అవుతాయ్‌: మారుతి

హైదరాబాద్‌: నేటితరం యువతను ఆకర్షించే విధంగా విభిన్న ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించి కెరీర్‌లో మంచి పేరు సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఇటీవల ‘మంచి రోజులొచ్చాయి‌’ చిత్రంతో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ‘పక్కా కమర్షియల్‌’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతి తదుపరి చిత్రాల గురించి శనివారం పలు వార్తలు బయటకు వచ్చాయి.

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి ఓ హార్రర్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని.. దానికి ‘రాజా డీలక్స్‌’ అనే పేరు ఖరారు చేశారని.. డీవీవీ దానయ్య నిర్మించే అవకాశం ఉందని అందరూ చెప్పుకొన్నారు. కాగా, సదరు వార్తలపై తాజాగా మారుతి స్పందించారు. సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు వాటంతట అవే బయటకు వస్తాయని అప్పటి వరకూ వేచి ఉండాలని తెలిపారు. ‘‘నా భవిష్యత్తు ప్రాజెక్ట్‌లు, వాటి టైటిల్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, ఇతర తారాగణంపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, సమయమే అన్నింటినీ బయటపెడుతుంది. అప్పటి వరకూ వేచి ఉండండి. ఒక దర్శకుడిగా నన్ను ఎంతో సపోర్ట్‌ చేస్తోన్న వారందరికీ ధన్యవాదాలు. బయట కరోనా తీవ్ర రూపం దాల్చింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి’’ అని మారుతి తెలిపారు. మారుతి ట్వీట్‌తో అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్‌’ పట్టాలెక్కిస్తారా? లేదా? అని కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని