Masooda: అసలు భయం ముందుంది!
‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్.
‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడీ సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రం ‘మసూద’ (Masooda). సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) శనివారం విడుదల చేశారు. ‘‘భవిష్యత్ అనేది మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది’’ అంటూ సంగీత చెబుతున్న డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తల్లీకూతుళ్ల అనుబంధాలు, వారి మధ్యతరగతి కష్టాలు, స్నేహం, ప్రేమ వంటి కోణాల్ని స్పృశిస్తూ సాగిన ప్రచార చిత్రం.. ఆఖర్లో హారర్ అంశాలతో ఆసక్తి రేకెత్తించింది. ‘‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది’’ అంటూ చిత్ర బృందం చెప్పిన తీరు చూస్తుంటే.. సినిమాలో హారర్ అంశాలకు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీసీ పతాకంపై విడుదల చేస్తున్నారు నిర్మాత దిల్‌రాజు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..