RaviTeja: బాడీ లోకల్‌.. మైండ్‌ గ్లోబల్‌.. రవితేజ మాస్‌ సాంగ్‌

రవితేజ హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక.

Published : 23 Sep 2022 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (RaviTeja) హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధమాకా’ (Dhamaka). శ్రీలీల కథానాయిక. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే  విడుదలకానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ఈ సినిమాలోని రెండో పాటను శుక్రవారం విడుదల చేసింది. ‘మాస్‌ రాజా’ (Mass Raja) అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించగా, నకాశ్‌ అజీజ్‌ ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. కథానాయకుడి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ గీతంలోని ‘బాడీ లోకల్‌.. మైండ్‌ గ్లోబల్‌’ తదితర చరణాలు రవితేజ అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. ఈ లిరికల్‌ వీడియోలో చూపించిన కొన్ని క్లిప్పింగ్స్‌ను బట్టి రవితేజ ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని