Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
Bhagavanth Kesari: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavan thKesari) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే 108 వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందెప్పుడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. అంతేకాదు, అనిల్ రావిపూడి శైలి ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం మిస్‌కాకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. కాజల్ (Kajal Aggarwal) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల (sreeleela) కీలక పాత్ర పోషిస్తుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్‌స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ ‘భగవంత్ కేసరి’ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి