‘మాస్టర్‌’ చిట్టి స్టోరీ.. జాంబిరెడ్డి థీమ్‌ సాంగ్‌

విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘మాస్టర్‌’. సంక్రాంతి కానుకగా

Published : 27 Jan 2021 23:15 IST

హైదరాబాద్‌: విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘మాస్టర్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులోని ‘చిట్టిస్టోరీ’ లిరికల్‌ సాంగ్‌ యువతను అలరించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

జాంబిరెడ్డి థీమ్‌ సాంగ్‌..

తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. తెలుగులో తొలి జాంబి చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘కొరుకు కొరుకు కొరుకుతా..’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. మామా సింగ్‌ సాహిత్యం అందించడమే కాక ఆయనే పాడారు. మార్క్‌ కె రాబిన్‌ స్వరాలు సమకూర్చారు. ఫిబ్రవరి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని