రిలీజ్‌కు ముందే ‘మాస్టర్‌’ రికార్డుల మోత

ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న ‘మాస్టర్’ విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో ఇప్పటికే 4కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.

Updated : 28 Nov 2020 07:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తున్న ‘మాస్టర్’ చిత్రం విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో ఇప్పటికే 4కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్‌ను నవంబర్‌ 14న విడుదల చేశారు. కాగా.. అత్యధిక లైకులు అందుకొని ఇటీవలే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి మరోసారి విలన్‌గా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అనిరుధ్‌ రవిచందర్‌ బాణీలు సమకూర్చారు. కళాశాలలో జరిగే రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. విజిల్‌ సినిమాతో హిట్‌ కొట్టిన విజయ్‌, ఖైదీ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న లోకేశ్‌, మరోవైపు విలన్‌గా విజయ్‌ సేతుపతి.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని