Meena: ఆ హీరోకి పెళ్లైనప్పుడు నా హృదయం ముక్కలైంది: మీనా
తాను ఓ బాలీవుడ్ హీరోని అమితంగా ఇష్టపడతానని, ఆయనకు పెళ్లైనప్పుడు తన హృదయం ముక్కలైందని ప్రముఖ నటి మీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులకే కాదు సినీతారలకూ ఇతర నటులపై క్రష్ ఉంటుంది. ఈ జాబితాలో నిలిచే సినీ తారల్లో మీనా (Meena) ఒకరు. బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) తన అభిమాన నటుడని గతంలోనే చెప్పిన ఆమె మరోసారి ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఇటీవల ఓ తమిళ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన ఆరాథ్య నటుడి పెళ్లిని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను హృతిక్‌రోషన్‌ను ఎంతగానో ఇష్టపడతా. నాకు పెళ్లికాకముందు హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలనుకునేదాన్ని. ఆయనకు పెళ్లైనప్పుడు చాలా బాధపడ్డా. ఆ సమయంలో నా హృదయం ముక్కలైంది’’ అంటూ మీనా నాటి సంగతులు నెమరువేసుకున్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన విద్యాసాగర్‌తో మీనా వివాహం 2009లో జరిగింది. ఊపిరితిత్తుల సమస్యతో విద్యాసాగర్ గతేడాది జూన్‌లో మరణించారు. ఆ విషాదం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. మీనా సినీ ప్రస్థానం బాల నటిగా మొదలైన సంగతి తెలిసిందే. తన కెరీర్ 40ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో ఇటీవల ‘మీనా 40’ పేరుతో వేడుక నిర్వహించారు. రజనీకాంత్, సుహాసిని, రోజా తదితరులు హాజరై సందడి చేశారు. ఆ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీనా తాజాగా పోస్ట్ పెట్టారు. తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాల్లో అదొకటని పేర్కొన్నారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘చంటి’, ‘ముఠామేస్త్రి’, ‘అబ్బాయిగారు’, ‘అల్లరి అల్లుడు’, ‘సూర్యవంశం’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ తదితర చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Afghanistan: ఉగ్రవాదం నుంచి ప్రభుత్వాధికారులుగా.. తాలిబన్లలోనూ క్వైట్ క్విట్టింగ్!
-
India News
Manish Sisodia: జైలు నుంచి దిల్లీ విద్యార్థులకు సిసోదియా ప్రత్యేక సందేశం!
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
Movies News
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం మరో యంగ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ కథతో
-
Politics News
Congress Vs SP: కూటమిపై కొట్లాట..కాంగ్రెస్ వద్దు.. మేం లేకుండా ఎలా?
-
World News
Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’