Meet Cute: ‘మీట్‌ క్యూట్‌’కు అర్థం చెప్పిన నాని.. మనసును తాకేలా వీడియో

నాని సోదరి దీప్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’. ఐదు విభిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ సిరీస్‌ నవంబర్‌ 25 నుంచి ప్రసారం కానుంది.

Published : 18 Nov 2022 13:55 IST

హైదరాబాద్‌: ఏదైనా రిలేషన్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే గొడవలు.. వాటిని అధిగమించి తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వాళ్లు చేయాల్సిన పనులను వివరిస్తూ రూపొందించిన ఫీల్‌గుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’ (Meet Cute). నేచురల్‌ స్టార్‌ నాని (Nani) సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై తెరకెక్కిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ‘‘నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’’ అంటూ నాని వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ మనసును హత్తుకునేలా ఉంది.

ఐదు కథల సమాహారంగా తీసిన ఈ సిరీస్‌లో సత్యరాజ్‌‌, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన తదితరులు నటిస్తున్నారు. ‘‘ఈ మనిషితో గొడవపడటం కూడా అనవసరం అనుకున్నప్పుడే బంధాలు విఫలమవుతాయి. మనం దేనిని ప్రేమిస్తామో దాని గురించి.. ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం’’ అంటూ సాగే సత్యరాజ్‌ సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. నవంబర్‌ 25 నుంచి సోనీ లీవ్‌లో ఇది ప్రసారం కానుంది. నాని సోదరి దీప్తి దీనికి దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని