‘కీటోడైట్‌ చేస్తే వచ్చాయ్‌రా ఈ కండలు’

ఇటీవల ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’తో అలరించిన సిద్దు జొన్నలగడ్డ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి నేహాశెట్టితో జతకట్టి ‘నరుడి బ్రతుకు నటన’లో నటిస్తున్నాడు. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Published : 08 Feb 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’తో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి నేహాశెట్టితో కలిసి ఆయన ‘నరుడి బ్రతుకు నటన’లో నటిస్తున్నాడు. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల తొలి పూజా కార్యక్రమం ఘనంగా చేసుకొని చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను చిత్రబృందం పంచుకుంది. ‘జిమ్‌ గట్టిగా చేస్తున్నట్టున్నవ్‌గా అని హీరోను అడగ్గా.. లేదు కీటోడైట్‌ చేస్తున్నా అని చెప్పి. ఆ తర్వాత అద్దం ముందు నిల్చొని కండలు చూసుకొని మురిసిపోతుంటాడు’ ఆ వీడియో ఆసక్తికరంగా ఉంది. మీరూ ఓ లుక్కేయండి మరి..

ఇదీ చదవండి..

నవ్విస్తూ.. ఆలోచింపజేస్తూ


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని