MeetCute: మనసును హత్తుకునేలా ‘మీట్‌ క్యూట్‌’ టీజర్‌

మనసును హత్తుకునే ప్రేమకథలతో సిద్ధమవుతున్న ఫీల్‌గుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’. ‘సోనీ లివ్‌’ వేదికగా త్వరలో విడుదల కానుంది.

Published : 12 Nov 2022 13:34 IST

హైదరాబాద్‌: నేచురల్ స్టార్‌ నాని (Nani) ప్రారంభించిన వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న సరికొత్త సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’ (Meet Cute). ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న దీని టీజర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. సత్యరాజ్‌‌, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైనా, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నటీనటుల మధ్య వచ్చే సంభాషణలు, దానికి అనుగుణంగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ మనసును హత్తుకునేలా ఉంది. ఇక, టీజర్‌ చివర్లో ‘‘అనుబంధాలు విఫలం అయ్యేది ఈ చిన్న చిన్న గొడవల వల్ల కాదు. గొడవ పడటం మానేసినప్పుడే అది ఫెయిలైనట్టు’’ అంటూ సత్యరాజ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. ఐదు ఎపిసోడ్స్‌తో సాగే ఈ సిరీస్‌కు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోనీ లివ్‌’ వేదికగా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని