Chiranjeevi: కలుద్దాం.. సంక్రాంతికి

సంక్రాంతికి థియేటర్లలో కలుద్దామంటున్నారు కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 25 Jun 2022 08:22 IST

సంక్రాంతికి థియేటర్లలో కలుద్దామంటున్నారు కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ప్రస్తుతం ఆయన బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) (Bobby) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ (Shruti Hassan) కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరు చేతిలో లంగర్‌ పట్టుకొని శక్తిమంతంగా కనిపించారు. అయితే ఆయన ముఖం మాత్రం చూపించలేదు. ‘‘కలుద్దాం.. సంక్రాంతికి.. జనవరి 2023’’ అని ఆ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను జోడించారు. త్వరలో టైటిల్‌తో పాటు టీజర్‌ విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘వాణిజ్య హంగులతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. 40శాతం చిత్రీకరణ పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని