నిహారికను ఎవరూ బీట్ చేయలేరు: వరుణ్‌తేజ్
మెగా కాంపౌండ్ నుంచి వచ్చి మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను అలరించిన నటుడు వైష్ణవ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి సందడి చేశారు
‘ఉప్పెన’ సక్సెస్.. మెగా కజిన్స్ స్పెషల్ చిట్‌చాట్
ఇంటర్నెట్‌డెస్క్: మెగా కాంపౌండ్ నుంచి వచ్చి మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను అలరించిన నటుడు వైష్ణవ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి సందడి చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా కజిన్స్.. నిహారిక, వరుణ్‌తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ గురించి స్పెషల్ చిట్‌చాట్ నిర్వహించారు.
నిహారిక: ప్రేమికుల దినోత్సవం రోజున లవర్స్‌తో కాకుండా చెల్లి/మరదలితో సమయాన్ని గడపడం ఎలా ఉంది?
సాయి తేజ్: ప్రశాంతంగా ఉంది. అసలే నాకు మేలో పెళ్లంట. బయట వార్తలు వస్తున్నాయి(నవ్వులు)
నిహారిక: సినీ పరిశ్రమకు 2020 గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ మీ అందరికీ గతేడాది ఎలా గడిచింది?
వరుణ్‌తేజ్: నీ పెళ్లి వల్ల గతేడాది అంతా నాకు కష్టంగా గడిచింది. పెళ్లి పనులు, ఏర్పాట్లతో సమయం గడిచిపోయింది. పెళ్లి అయ్యాక ఎంతో సంతోషంగా ఉంది.
సాయి తేజ్: నిజం చెప్పాలంటే లాక్‌డౌన్ వల్ల ఏడెనిమిది నెలలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ, ఏడాది చివరికి వచ్చేసరికి ఎంతో సంతోషంగా గడిచిపోయింది. నీ పెళ్లి జరిగిన ఐదు రోజులు మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
నిహారిక: వైష్ణవ్.. ‘ఉప్పెన’ 2020లో విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. మరి, నీకు ఎలా గడిచింది గతేడాది?
వైష్ణవ్: ‘ఉప్పెన’ రిలీజ్ గురించి అసలు పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌లో అన్నయ్యతో కలిసి ఇంట్లో పనులు చేసేవాడిని. క్లీనింగ్, కుకింగ్... అలా రోజులు గడిచిపోయాయి.
వరుణ్ తేజ్: వాడి సినిమా రిలీజ్ అంటే మేము చాలా టెన్షన్ పడ్డాం.
సాయితేజ్: నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా అయితే ఐదేళ్లు వాయిదా పడింది.(నవ్వులు) (వరుణ్‌తేజ్ మధ్యలో అందుకుని సినిమాలపరంగా నాకు సీనియర్ కావాల్సినవాడు నాతోపాటు ఇండస్ట్రీలోకి వచ్చాడు (నవ్వులు))
నిహారిక: వైష్ణవ్.. ‘ఉప్పెన’కు వచ్చిన స్పందన ఏమిటి?
వైష్ణవ్: సినిమా చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. పెదమామ, అత్త నుంచి వచ్చిన ప్రశంస ది బెస్ట్. నిహారికతో కలిసి ‘ఉప్పెన’ ప్రివ్యూ చూశాను. సినిమా అయ్యేవరకూ చాలా కూల్‌గా ఉంది. నన్ను మెచ్చుకుంది. అనంతరం, దర్శకుడు బుచ్చిబాబు దగ్గరకు వెళ్లి.. ఏడ్చేసింది.
‘శర్వానంద్ హీరోగా నటించిన ‘అమ్మచెప్పింది’ ప్రివ్యూకు నిహాతో కలిసి వెళ్లాను. సినిమా చూస్తున్నంతసేపు.. ఏడవద్దని నిహారికకు చెప్పాను. కట్ చేస్తే.. సినిమా పూర్తయ్యేసరికి శర్వా అన్న దగ్గరకు వెళ్లి.. ఆయన్ని హత్తుకుని బాగా ఏడ్చేశాను. అది ఎప్పటికీ మర్చిపోలేను.’
వరుణ్‌తేజ్: ‘ఉప్పెన’ వల్ల మొదటిసారి నిన్ను స్ర్కీన్‌పై చూడడం సంతోషంగా అనిపించింది. నువ్వు బాగా నటించావు. మొదటి చిత్రంతోనే అలాంటి సినిమాలో నటించడం కూడా మామూలు విషయం కాదు. డబ్బింగ్ కూడా బాగా చెప్పావు. కృతిశెట్టి నటన అదిరిపోయింది.
నిహారిక: ‘నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు’ అని ఓ సారి వైష్ణవ్ అడిగితే ఏదో చెప్పాడు?
సాయి తేజ్: ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పేవాడు. కొన్నిసార్లు జ్యుయలరీ డిజైనింగ్, సైంటిస్ట్, రోబోటిక్స్.. ఇలా ప్రతిసారీ ఏదో చేసేస్తాను అని చెప్పేవాడు. ఓసారి అయితే ఆర్మీలోకి వెళ్లిపోతానని చెప్పి నాతో దరఖాస్తు కూడా రాయించాడు.
నిహారిక: ‘ఉప్పెన’ సినిమాలో విరామానికి ముందు చూపించినట్లు.. మీరు కూడా పడవలో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తారు? ఎలాంటి భోజనం తీసుకువెళ్తారు? అక్కడ ఏ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు?
వైష్ణవ్: తినడానికి సూషీ, చూడడానికి ‘శివాజీ’, నా లైఫ్‌లోకి ఇంకా సరైన పర్సన్ రాలేదు. కాబట్టి ఎవర్నీ తీసుకువెళ్లను.
సాయి తేజ్: తినడానికి పులిహోర, చూడడానికి ‘చంటబ్బాయ్’, ‘తిక్కా’ హీరోయిన్ లారిసా బోనేసిని తీసుకువెళ్తా.
వరుణ్‌తేజ్: డైట్‌లో ఉన్నాను కాబట్టి ఫుడ్ ఏదైనా ఓకే. నాతోపాటు నాన్నని తీసుకువెళ్తా. ఫిషింగ్‌కు వస్తానని నాన్నకు ఎప్పుడో మాటిచ్చా. కాబట్టి ఇప్పుడు తీసుకువెళ్తా. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ చూస్తా.
నిహారిక: నా భర్త చైతన్యతో కలిసి వెళ్తాను. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ చూడడానికి ఆసక్తి కనబరుస్తా. పెరుగన్నం తీసుకువెళ్తా.
నిహారిక: బాగా వంట చేయగలిగేది ఎవరు?
వరుణ్: మా చెల్లి నిహారిక. ఇందులో మా చెల్లిని ఎవరు బీట్ చేయలేరు.
ఒక్కమాటలో వైష్ణవ్‌తేజ్ చెప్పిన సమాధానాలు
ఫేవరెట్‌ఫిల్మ్: శివాజీ
ఎక్కువసార్లు చూసిన సినిమా: బద్రి, తమ్ముడు
సూపర్‌హీరో క్యారెక్టర్: బ్యాట్‌మాన్
విజయ్‌సేతుపతి: మంచి వ్యక్తి, వినయ, విధేయతలు కలిగిన వ్యక్తి
సుకుమార్: లెక్కల టీచర్
దేవిశ్రీప్రసాద్: బాగా మాట్లాడతారు
బుచ్చిబాబు: సైలెంట్
బేబమ్మ: బ్యూటిఫుల్
ఫోన్‌లో ఎక్కువగా వాడే యాప్: ఇన్‌స్టా
సెలబ్రిటీ క్రష్: సోనాక్షి సిన్హా
నటించడం నా వల్ల కాదు అనిపించిన సన్నివేశం: బేబమ్మని పట్టుకుని ఓ విషయం చెప్పాలనే సీన్‌లో నిజంగానే కన్నీళ్లు వచ్చేశాయి. షూట్‌కు పేకప్ చెప్పేసి.. మరుసటి రోజు షూట్ చేశాం.
మాకు ఎప్పుడైనా అబద్దం చెప్పావా: చెప్పాను
పెద్దమామ, కల్యాణ్ మామ: ఇద్దరు ఫేవరెట్సే
నీ ఫేవరెట్ కజిన్: నిహారిక
అమ్మాయి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్: ‘ఉప్పెన’లో బేబమ్మ ఇచ్చింది.
ఫస్ట్ మూవీ: థ్యాంక్స్
సిక్స్ ప్యాక్: నేను చేస్తాను అనుకోవడం లేదు
అవార్డ్స్: ఎంటర్‌టైన్‌మెంట్
ఆన్‌స్ర్కీన్ కెమిస్ట్రీ: కొంచెం ఇబ్బంది.
ఇదీ చదవండి
సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/05/23)
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Siddaramaiah: కొత్త మంత్రులకు టార్గెట్స్ ఫిక్స్ చేసిన సీఎం సిద్ధరామయ్య!
-
Sports News
IPL Final: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా.. మే 29న మ్యాచ్ నిర్వహణ
-
India News
Wrestlers Protest: ఆందోళనకు దిగిన రెజ్లర్లపై కేసులు నమోదు
-
General News
CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ