చిరు ‘ఆచార్య’ టీజర్‌ అదుర్స్‌

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. ‘ధర్మస్థలి’కి ద్వారాలు తెరుచుకున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా

Updated : 29 Jan 2021 17:48 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. ‘ధర్మస్థలి’కి ద్వారాలు తెరుచుకున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అంటూ రామ్‌చరణ్‌ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దేవాలయాలు, వాటిపై జరిగే అన్యాయాలపై పోరాడే వ్యక్తిగా చిరు ఇందులో కనిపించారు. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అంటూ చివరిలో చిరు తనదైన పంచ్‌ డైలాగ్‌తో అదరగొట్టారు.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చదవండి

రివ్యూ: 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని