Chiranjeevi: సుకుమార్‌ డైరెక్షన్‌లో మెగాస్టార్‌.. ఫొటో షేర్‌ చేసిన చిరు

‘గాడ్ ఫాదర్‌’, ‘భోళాశంకర్‌’ ఇలా వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి. షూటింగ్స్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా ఆయన మరో....

Published : 01 Apr 2022 13:39 IST

హైదరాబాద్‌: ‘గాడ్ ఫాదర్‌’, ‘భోళాశంకర్‌’.. ఇలా వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి. షూటింగ్స్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా ఆయన మరో పనిలో నిమగ్నమవుతున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఫొటో. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్‌తోపాటు మోహన్‌రాజా, మెహర్‌ రమేశ్‌, బాబీ చిత్రాల షూట్‌లో ఉన్న చిరంజీవి తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి వర్క్‌ చేశారు. అయితే, వీళ్లిద్దరూ కలిసి పనిచేసింది సినిమా కోసం కాదు.. ఓ యాడ్‌ షూట్‌ కోసమే. ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రకటన కోసం చిరంజీవి రంగంలోకి దిగగా.. సుకుమార్‌ ఆ యాడ్‌ని రూపొదించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిరు కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. సుకుమార్‌ టాలెంట్‌ని మెచ్చుకున్నారు. ‘‘దర్శకుడిగా సుకుమార్‌ ప్రతిభ అందరికీ తెలిసిందే. ఓ యాడ్‌ఫిల్మ్‌ కోసం ఆయన దర్శకత్వంలో నేను నటించాను. షూట్‌ని ఎంతగానో ఎంజాయ్‌ చేశా’’ అని చిరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని