Gautham Raju: గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు: చిరంజీవి

ప్రముఖ సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (Gautham Raju) మరణం వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకు(Cinema Industry) పెద్దలోటని అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గౌతంరాజు మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆయన...

Updated : 06 Jul 2022 13:47 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (Gautham Raju) మరణం వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకు(Cinema Industry) పెద్దలోటని అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గౌతంరాజు మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆయన సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ‘‘గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్‌ని కోల్పోవడం దురదృష్టకరం. ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వాడి!! మితభాషి అయినప్పటికీ ఎడిటింగ్‌ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్‌ అంత వేగం. ‘చట్టానికి కళ్లు లేవు’ నుంచి ‘ఖైదీ నెంబర్ 150’ వరకూ నేను నటించిన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు.. మొత్తం పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని చిరంజీవి తెలిపారు.

‘‘ఎడిటింగ్ అంటే కేవలం కత్తెరతో ఫ్రేమ్స్ కత్తిరించడమే కాదు.. ఏది కట్ చెయ్యాలో, ఏది కంటిన్యూ చెయ్యాలో దర్శకుడికి చెప్పగల సామర్థ్యం కూడా ఉండాలని నిరూపించిన శ్రామికుడు ఎడిటర్ గౌతం రాజు. ఆయన హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ - పరుచూరి గోపాలకృష్ణ

‘‘ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు మరణం నన్ను ఎంతో కలచివేస్తోంది. అంకుల్‌ ఇకపై మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతా. ఎడిటింగ్‌ రంగానికి మీరు చేసిన సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నా’’ - మంచు మనోజ్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని